ఐపీల్ 2022 సీజన్లో అఫైర్ ల తో సమస్యగా మారింది ఆటగాళ్లకు కొన్ని బంతుల అంపైర్ తప్పుడు నిర్ణయాలకు మ్యాచ్ గెలుపే మారిపోతుంది. మంచి అనుభవం ఉన్న బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతూనే ఉన్నారు. నిన్న ఢిల్లీ మరియు రాజస్థాన్ మ్యాచ్ జరిగింది మొదటిగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 222 భారీ స్కోర్ చేసింది. బట్లర్ సెంచరీ తో దుమ్ములేపాడు. అదే విధంగా సంజు సాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తర్వాత బారీలోకి దిగిన ఢిల్లీ కూడా ఆఖరి వరుకు పోరాడి ఓడింది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్ లో 36 పరుగులు కావాలి . ప్రతి బాల్ సిక్స్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఢిల్లీ ఇక్కడే అంపైర్ ల తప్పుడు నిర్ణయం పాంట్ కు కోపం తెపించింది. చివరి ఓవర్ ను మెకాయ్ బౌలింగ్ చేసాడు.. . స్ట్రయికింగ్ ఎండ్ లో పావెల్ సిద్ధంగా ఉన్నాడు. అయితే అనుకోని విధంగా తొలి మూడు బంతులలోనే మూడు సిక్స్ లు బాధి 18 రన్స్ తెపించాడు. దీంతో మరో 3 బంతులకు 18 పరుగులుగా కావాల్సి ఉండగా.. ఆ ఓవర్ మూడో బంతిని మెకాయ్ హై ఫుల్ టాస్ వేశాడు. అది కాస్త పైకి డుము కంటే ఎక్కువ ఎత్తులో వెళ్లినట్లు అనిపించింది అది నోబెల్ కోరమని అవతల ఉన్న కుల్దీప్ యాదవ్కోరాడు.. డగౌట్ లో ఉన్న ఢిల్లీ సారథి రిషభ్ పంత్ కూడా అది నో బాల్ అంటూ అక్కడి నుంచే సైగ చేశాడు. ఐతే దానికి అంపైర్ లు అంగీకరించలేదు దీంతో పంత్ కోపం తో ఊగిపోయాడు ఆడుతున్న ఆటగాళ్లను వచ్చేయమని కోరాడు చివరికి ఆట కొనసాగగా 15 పరుగుల తేడా తో రాజస్థాన్ విజయం సాధించింది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs