తెలుగు రాష్ట్రాలలో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకున్న రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టగా ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ కూర్చుని ఉన్న ఇద్దరు, బస్సు లో ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది.
బస్సులో ఇరవై మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీస్ లు అక్కడకు చేరుకుని .. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 15 మందిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన ప కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.