ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధ దాడిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పాఠశాల పైన రష్యా చేసిన దాడిలో 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ అనే ప్రాంతంలో బైలోహారివ్కా గ్రామంలోని పాఠశాలపై రష్యా సైన్యం ఈ బాంబు దాడి లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దాడి పైన దీనిపై లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పదించారు. రష్యా సైన్యం శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబు దాడి చేసినట్టు తెలిపారు. దాడి సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. బాంబు దాడితో పాఠశాల పూర్తిగా నేలమట్టమైందని, తమ సిబ్బంది 4 గంటలు శ్రమిస్తేనే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదని పేర్కొన్నారు. 30 మందిని శిధిలాల కింద చిక్కుకున్న చిన్నారులను వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. దీంతో పాటు రష్యా మరికొన్ని ప్రాంతాల పైన దాడి చేస్తూనే ఉంది. సాధారణ పౌరులని టార్గెట్ చేస్తూ దాడి చేస్తుంది అంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అయితే రష్యా మటుకు తమ టార్గెట్ సైనిక స్థావరాలు మాత్రమే అంటూఉక్రెయిన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తుంది.