కాకినాడ జిల్లాలో సర్పవరం లో గోపాలకృష్ణ అనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. పిస్టల్‌తో కాల్చుకుని ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు మరియు జిల్లా ఎస్పీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఎస్ ఐ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తోనే పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేశారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక కొన్నాళ్ళు ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు పై అధికారులు. అయితే అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తాజాగా పోలీస్ పై అధికారులు వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆత్యహత్య కు ఎస్ఐ పాల్పడినట్లు సమాచారం.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs