ప్రపంచంలో అతి పొడవైన భవనం ఏది అంటే మొదటగా గుర్తు వచ్చేది దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా అంటారు. మరి ప్రపంచంలో అతి సన్న, ఎతైన భవనం ఎక్కడ ఉందొ తెలుసా ? న్యూయార్క్‌లో నగరంలో మాన్‌హట్టన్‌లో నిర్మించిన ‘స్టెయిన్వే టవర్’. నిర్మిచారు దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు మాత్రమే. ఎత్తు మటుకు 435 మీటర్లు. ఎత్తుకు వెడల్పు కు ఉన్న నిష్పత్తి తేడా 25:1.. ఇదే బుర్జ్ ఖలీఫా 828 మీటర్లు ఎత్తు.. వెడల్పు 45 మీటర్లు. స్టెయిన్వే టవర్ లో 82 అంతస్తులు 60 అపార్టుమెంట్లు ఉన్నాయి. ఒకో అపార్ట్మెంట్ ధర మన ఇండియన్ కరెన్సీ లో 60 కోట్లు. పెంట్ హౌస్ ధరైతే ఏకంగా రూ. 500 కోట్లపైనే. ఈ సన్నని భావనని న్యూయార్క్ ఆర్కిటెక్చర్ కంపెనీ ‘షాప్’ డిజైన్ చేసింది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs