రంగారెడ్డి: పని ఒత్తిడి మరియు ఇతర కారణాల వలన సాఫ్ట్ వారే ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీధర్ అనే సాఫ్ట్ వెర్ ఇంజినీర్ అపార్ట్మెంట్పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. శ్రీధర్ కింద పాడగా పెద్ద శబ్దం రావడంతో అపార్ట్మెంట్ లోని జనాలు బయటకు పరుగులు పెట్టారు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీధర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గత కొంత కాలంగా పని మీద ఒత్తిడి మరియు అనారోగ్యం తో బాధపడుతూ కుమిలిపోయేవాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. శ్రీధర్ మృతితో అపార్ట్మెంట్ లో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs