గత వారం రోజుల నుంచి నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కాస్త తేరుకున్నాయి. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన గంట తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ ఒకేసారి 740 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 209 పాయింట్లు లాభపడింది. గత వరం రోజులుగా నష్టాలపాలైన మార్కెట్లు కొన్ని కోలుకుంటున్నాయి.
ఉదయం 10:10 గంటల సమయంలో 755 పాయింట్ల లాభంతో బీఎస్ఈ సెన్సెక్స్ 58 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ 238 పాయింట్లు లాభపడి 17,348 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతో రెండు సూచీలు క్షణక్షణానికి పైపైకి ఎగబాకుతున్నాయి. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందాయి. హెచ్డీఎఫ్సీ, భారతీఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో రియల్టీ, బ్యాంకు, ఎఫ్ఎంసీజీలు లాభాల బాటలో ప్రయాణిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినా సూచీలు తీవ్రఒడుదొడుకులకు లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 76.71 పాయింట్లు దిగజారి 57,200 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8.20 పాయింట్లు నష్టపోయి 17,101 వద్ద స్థిరపడింది.