16716902607537667714

రాజ ద్రోహం చట్టాన్ని నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ : వలస పాలన నాటి ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపైన సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఆ చట్టాన్ని తిరిగి సమీక్షించడం పూర్తయ్యే వరకు దీన్ని ఎట్టిపరిస్థితుల్లో వినియోగించకూడదు అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఆదేశారు ఇచ్చారు. దీంతో రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు వేస్తున్నట్లు ప్రకటించింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్ ల సంబంధించిన దాఖలును నిషేదిస్తునట్లు పేర్కొంది.

ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 124ఏ కిందఈ కేసులు నమోదై, జైళ్లలో ఉన్న వారు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ కోసం వాళ్ళ న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని పునరాలోచించే దిశగా డ్రాఫ్ట్ ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వినిపించారు. రాజ ద్రోహం అభియోగాల కింద కేసు నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయంటు ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారి భావించినప్పుడే చేయాల్సి ఉంటుందని కోర్ట్ కు వివరించారు . చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసుల నమోదును నిలిపివేయడం సరికాదు అంటూ వాదించారు. అయితే ఈ వాదనల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదంటూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని పిటిషన్లర్లు పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. హనుమాన్ చాలీసా పారాయణం చేసినా కూడా రాజద్రోహం అభియోగాలతో ఉన్న ఈ కేసు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతుందోని పేర్కొంది..సమీక్ష పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలవుతుందని అంటూ తెలిపింది.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow