విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజైషన్ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నడుమ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కార్మికులు ఎందుకు ముట్టడించారు..? ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రెండేళ్ళుగా నలుగుతోంది. కార్మిక లోకం ఒక్కటిగా గొంతెత్తి ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని నినదిస్తోంది. కానీ వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని, వారు ఎందుకు వచ్చారు?, వారికి ఏమి చెప్పారో…వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్‌ప్లాంట్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని తెలిపారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs