కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ సినిమాల విడుదలకు సంబంధించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఇటీవలే ఒక లేఖను కూడా విడుదల చేసింది. దీనికి కారణం దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడును సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించడం. దీంతోపాటు థియేటర్ల ఓనర్లతో ముందుగానే అగ్రిమెంటు కూడా చేసుకున్నారు. అయితే.. తాజాగా
నారప్ప చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసే విషయమై ఆ చిత్ర నిర్మాత సురేశ్ బాబు కీలక కామెంట్స్ చేశారు.
అలాగే సంక్రాంతికి రిలీజయ్యే సినిమా ల గురించి కుడా స్పందించారు.. విక్టరీ వెంకటేశ్ అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ 13న ఒక రోజు నారప్ప చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సురేశ్ బాబు వెల్లడించారు. కరోనా కారణంగా నారప్పను థియేటర్ లో విడుదల చేయలేకపోయామని తెలిపిన సురేశ్ బాబు…. అమెజాన్ ఓటీటీ సంస్థను ఒప్పించి వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న నారప్పను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ షో ద్వారా వచ్చే నగదును ఒక మంచి కార్యక్రమం కోసం ఉపయోగించనున్నట్లు సురేశ్ బాబు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సురేశ్ ప్రొడక్షన్స్ లోనే వెంకటేశ్, రానా సినిమాలు నిర్మాణం జరుపుకుంటాయని సురేశ్ బాబు వెల్లడించారు.