శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాల్లో తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పరిణయోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ప్రతియేటా వైశాఖ శుద్ధ నవమి నుండి ఏకాదశి వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం అనవాయితీ వస్తోంది.రెండవ రోజు మలయప్పస్వామి వారు సర్వాంగ సుందరంగా అలంకారభూషితుడై అశ్వవాహాన్ని అధిష్టించగా, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లు దంతపు పల్లకీపై ఊగేరింపుగా నారాయణగిరి ఉద్యనవనానికి చేరుకున్నారు.టీటీడి అర్చకులు, అధికారులు స్వామి, అమ్మవార్లకు ఎదురుకోళ్లు నిర్వహించారు.అటుతరువాత స్వామి, అమ్మవార్లను బంగారు తిరుచ్చిపై కోలువు దీర్చి ఊంజల్ సేవతో పాటు వేదపారాయణం, సంగీత గోష్టి, అన్నమయ్య కీర్తనల అలాపన చేశారు.. అనంతరం స్వామి, అమ్మ వార్లు ఊరేగింపుకు ఆలయానికి చేరుకున్నారు.ఓం నమో వేంటేశాయ
69
previous post