తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా లో పత్తిపాకలో పట్టపగలే దారుణ తెరాస నేతని దారుణంగా హత్యచేశారు. మహబూబాబాద్ 8 వార్డు కౌన్సిలర్ TRS కు చెందిన బానోత్ రవిని దుండగులు దారుణంగా రోడ్డు పైన నరికి చంపారు. కౌన్సిలర్ రవి బైక్పై వెళ్తుండగా దుండగులు కాపుగాసి అతనిపై గొడ్డలితో తల పైన దాడి చేసారు. దీంతో రోడ్డు న పోయేవారు అబులన్స్ కు సమాచారం ఇవ్వగా తీవ్ర గాయాలపాలైన కౌన్సిలర్ రవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా రాజకీయ కోణం లో ఏమైనా హత్యా చేసారా అని అన్ని కోణంలో విచారణ చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs