విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు ఒకటై రావాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఒక్క ఏడాదికి రూ. 5వేల కోట్లు పన్నులు ప్లాంట్‌కు చెల్లిస్తున్నామని నాయకులు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం దేశంలో
ఉన్న వంద మంది ఎంపీ సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలని చూస్తున బీజేపీ ద్విపం త్వరలో ఆరిపోవడం ఖాయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈనెల 28న విశాఖ బంద్ నిర్వహిస్తాం అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అనే వరకు పోరాటం చేస్తామని అన్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తి కానుంది అన్నారు. అయినా సరే మా పోరాటం ఆగదు అన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs