వరంగల్ పట్టణంలో మహాత్మా గాంధీ మెమోరియల్ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంగా ఈ ఆసుపత్రి లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేపిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఈ రోగి కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. అయితే ఐసీయూలోకి ప్రవేశించిన ఎలుకలు శ్రీనివాస్ కాళ్లు, చేతులు కొరకడంతో చికిత్స పొందుతున్న వ్యక్తికి తీవ్ర రక్తస్రావమైంది. విషయం ఆసుపత్రి సిబందికి తెల్సి వెంటనే ఎలుకల్ని తరిమేసి చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రి ఎలుకలు కొరకడం ఏంటని రోగి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై రోగులు, నగర ప్రజలు మండిపడుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందే వ్యక్తిని డాక్టర్లు, సిబ్బంది నిత్యం భద్రతగా ఉంచుతారు. అలాంటిది ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి సిబంది పైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs