సిద్దిపేట : ప్రేమించిన వ్యక్తి కోసం పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు తీసింది ఓ యువతీ పెళ్ళైన 35 రోజులకే భర్త ని పథకం ప్రకారం పైకి పంపింది. కట్టుకున్న భర్తకి తినే ఆహారంలో ఎలుకల మందు కలిపి మరి చంపింది.
వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట లోని తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామల అనే యువతికి దుబ్బాక మండలం చిన్న నిజాంపేట ప్రాంతానికి చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)తో 2022 మార్చి 23న వివాహం జరిగింది. చంద్రశేఖర్ ఎక్కువ చదువుకోలేదు పొలం ఉండడంతో వ్యవసాయం చేస్తున్నాడు. శ్యామల చిన్నపాటి స్నేహితుడు అయిన శివకుమార్ మూడేళ్లుగా ప్రేమిచుకుంటున్నారు. అయితే తల్లి తండ్రులు ప్రేమిచిన వ్యక్తితో పెళ్ళికి నిరాకరించారు. దీంతో ఇష్టం లేకుండానే చంద్ర శేఖర్ ను పెళ్లి చేసుకుందిశ్యామల దీంతో ఎలాగైనా చంద్రశేఖర్ ని హతమార్చి శివకుమార్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని భావించింది.
దీంతో చంద్రశేఖర్ ని చంపడానికి శివ తో కలిసి శ్యామల స్కెచ్ వేసింది. చంద్రశేఖర్ తినే ఆహారంలో ఏప్రిల్ 19న ఎలుకల మందు కలిపి పెట్టింది శ్యామల. ఆ ఆహారం తిని చంద్రశేఖర్‌కు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మల్లి ఏప్రిల్ 20 న ఇంటికి వచ్చాడు. తొలి ప్రయత్నం విఫలం అవ్వడంతో ఈసారి ఎలాగైనా చంపేయాలి అని పక్క ప్రణాళిక వేశారు శ్యామల మరియు శివ. శివ తన ఇద్దరు స్నేహితులు రాకేశ్, రంజిత్, శివకు చిన్నమ్మ కొడుకైన సిరిసిల్లకు చెందిన భార్గవ్, మరో బంధువు సాయికృష్ణతో కలిసి స్కెచ్త్ వేశారు. దీంతో సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పి శ్యామల.. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏప్రిల్ 28న అనంతసాగర్‌కు బయలుదేరారు. మాటలో దించి చెప్పి ధన్వంతరి అగ్రహారానికి వెళ్లే మట్టి దారిలో వేళ్తే త్వరగా వెళ్లిపోవచ్చు అని మట్టి దారిలో తీసుకెళ్లింది. అప్పటికే మట్టి దారిలో ఎవరికీ తేలినట్టు అక్కడ కారులో మాటు వేసిన శివ, నలుగురు యవకులు చంద్రశేఖర్‌పై దాడి చేసి మెడకు తాడు చుట్టి చంపేశారు.
శ్యామల చాతి నొప్పి డ్రామాలు
భర్త చంద్ర శేఖర్ చనిపోయాడు అని తెలిసి కుటుంబీకులకు చంద్ర శేఖర్ చాతి నొప్పి తో కింద పడిపోయాడు అని చెప్పి సమాచారం అందించింది. 108కి సమాచారం అందించి వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఏడుస్తూ త్వరగా రండి అంటూ తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఎప్పుడు లేని విధంగా ఛాతి నొప్పి రావడం ఏంటని కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి మనెవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత నెల 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. శ్యామలపై అనుమానం రావడంతో ఆమె కాల్ డేటాను పోలీస్ లు పరిశీలించారు శివతో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. శ్యామలను విచారించగా అసలు విషయం బయటపెటింది. దీనికి కారణంగా అయిన అందర్నీ అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించారు.