అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష అని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హల్ నందు జరిగిన అన్నమయ్య జిల్లా స్థాయి వైఎస్ఆర్ సున్నావడ్డీ మూడవ విడత మెగా చెక్ లబ్దిదారులకు అందచేయు కార్యక్రమంలో కలెక్టర్ గిరీష పిఎస్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సున్నావడ్డీ పథకం డ్వాక్రా అక్కచెల్లెమ్మలుకు వరమన్నారు.చెప్పిన మాట ప్రకారం సున్నా వడ్డీ పథకాన్ని వరుసగా సీఎం జగన్ అందిస్తున్నారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 9.76 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలకు రూ 1261 కోట్ల నిధులను సీఎం విడుదల చేసారన్నారు.అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 30,714 సంఘాలకు రూ 57, 42, 24, 312, రాయచోటి నియోజక వర్గంలో 5158 సంఘాలకు రూ 8.27 కోట్ల మేర అక్కచెల్లెమ్మలు లబ్దిపొందుచున్నారన్నారు.సున్నా వడ్డీ క్రింద మూడు విడతలకు గాను రాయచోటి నియోజక వర్గంలో రూ 25.62 కోట్లు లబ్ది పొందడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని, ప్రతి రూపాయిని అక్క చెల్లెమ్మలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సంఘాలు సుమారు 6 కోట్ల రూపాయల మేర పొదుపులు చేసుకున్నారని, పట్టణంలో పదివేల మంది సంఘ సభ్యుల భాగస్వామ్యంగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ను నడుపుచుండడం హర్షణీయం, అభినందనీయమన్నారు.కలెక్టర్ గిరీష పి ఎస్ మాట్లాడుతూ మహిళాభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.మహిళల ఆర్థిక స్వావలభనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.మండల కేంద్రాలలో కూడా జగనన్న మహిళా మార్ట్ లు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. మహిళలు అనుకుంటే సాధించలేనిదేది లేదని, స్వయం ఉపాధి పథకాలు, పాల ఉత్పత్తులుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషిచేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి సంఘానికి సున్నా వడ్డీ వర్తిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మెప్మా పిడి రామ్మోహన్ రెడ్డి, ఏరియా కో ఆర్డినేటర్లు సత్యనారాయణ, వేణుమాధవ్, మెప్మా అధికారి నాగరాజు ,ఎంపిఎం లు, సిసి లు పాల్గొన్నారు.
42
previous post