తిరుమల:- కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజలు విశ్వసించారని తెలంగాణ బిజేపి నాయకురాలు డికే.అరుణ స్పష్టం చేశారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో డికే.అరుణ కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.నాలుగు రాష్ట్రాల్లో బిజేపి ఘన విజయం సాధించడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందని, మేము ఆశించిన విధంగా బిజేపి విజయకేతనం ఎగుర వేసిందని ఆనందం వ్యక్తం చేశారు.బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని, చాలా మంది ప్రచారం చేసారని, అందుకు భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని కోరుకున్న వారికి ప్రజలు చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చారన్నారు.కేంద్రంలోను,రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే,ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజలు విశ్వసించరని, నాలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ ముఖ్యమంత్రికి నాలుగు రాష్ట్రాలో బీజేపీ గెలుపే సమాధానం చెప్పిందన్నారు.తన ప్రభావాన్ని కోల్పోతున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అనే నినాదాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యతిరేకత ఉందని, కెసిఆర్ పెట్టిన పధకాలు అన్ని ఫెయిల్యూర్ అయ్యాయని, టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయ పార్టీ బీజేపీనే అని ఆమె తెలియజేశారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs